Sunday, January 19, 2025

ఇండియా కూటమిలో చేరనున్న భీమ్ ఆర్మీ

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రతిపక్ష ఇండియా కూటమిలో భీమ్ ఆర్మీ కొత్తగా చేరనున్నది. చంద్ర శేఖర్ ఆజాద్ నాయకత్వంలోని భీమ్ ఆర్మీని ఇండియా కూటమిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రీయ లోక్ దళ్ ప్రయత్నాలు సాగిస్తోంది. చంద్రశేఖర్ ఆజాద్‌ను ఇండియా కూటమిలో చేర్చుకోవడం ద్వారా దళిత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని కూటమి భావిస్తోంది.

ఆజాద్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రీయ లోక్ దళ్ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి తెలిపారు. అయితే ప్రతిపక్ష కూటమిలో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఎప్పుడు చేరతారన్నద ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు. ఇండియా కూటమిలో చేరికలు ఇప్పటికే మొదలయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలు కూటమిలో చేరతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతికి ఉత్తర్ ప్రదేశ్‌లో దళితులు దూరం అవుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా ఆ ఓటర్లను తమ కూటమి వైపు ఆకట్టుకోవచ్చని ఆర్‌ఎల్‌డి వర్గాలు తెలిపాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లా గడ్కులి గ్రామానికి చెందిన ఆజాద్ దళితుల ఆరాధ్యుడు బిఆర్ అంబేద్కర్, బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరాం మార్గదర్శకత్వంలో దళితుల తరఫున పోరాటం సాగిస్తూ తన రాజకీయ బాటను నిర్మించుకుంటున్నారని వర్గాలు తెలిపాయి. ఈ ప్రయత్నాలు ఫలప్రదమైతే ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాది పారీ-్టరాష్ట్రీయ లోక్ దళ్– కాంగ్రెస్ కూటమి ఏర్పడగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

బిజ్నోర్ జిల్లాలోని నగీనా రిజర్డ్ స్థానం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రశేఖర్ ఆజాద్ భావిస్తున్నారు. దళితులు, ముస్లిములు అత్యధికంగా నివసించే ఈ నియోజకవర్గంలో తన గెలుపు సునాయాసమని భావిస్తున్న ఆజాద్ అక్టోబర్ 9న నగీనాలో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రస్తుతం నగీనా స్థానానికి బిఎస్‌పి ఎంపి గిరీష్ చంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిజెపి అభ్యర్థి యశ్వంత్ సింగ్‌ను 1.6 లోల ఓట్ల తేడాతో గిరీష్ చంద్ర ఓడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బిఎస్‌పి అభ్యర్థిని సమాజ్‌వాది పార్టీ బలపరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News