Thursday, January 23, 2025

యూపీలో ముస్లింల కోసం బిజెపి ‘మోడీ మిత్రాస్’ ప్రచారం!

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముస్లింలు ‘మోడీ మిత్రులుగా’ మారేందుకు ఆ రాష్ట్ర బిజెపి ప్రచారాన్ని చేపట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఈ ప్రచారం చేపట్టింది. మైనారిటీ కమ్యూనిటీని బిజెపి వైపుకు మళ్లించుకునే దృష్టితో దీన్ని చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజెపి మైనారిటీ మోర్చా చేపట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 29 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో 2019లో 14 నియోజకవర్గాల్లో బిజెపి గెలువలేకపోయింది. ఇప్పుడు బిజెపి మైనారిటీ మోర్చా యూపీ ముస్లింల కోసం ‘మోడీ మిత్రాస్’ అనే ప్రచారాన్ని చేపట్టింది. దీన్ని బిజెపి మైనారిటీ మోర్చా చేపడుతోంది.

గత ఏడాది మొరాదాబాద్, బిజ్నోర్, సహరన్‌పూర్, ముజఫ్ఫర్‌నగర్, అమ్రోహ, బాల్‌రామ్‌పూర్, ఘాజీపూర్, బరేలి, రామ్‌పూర్, ఆజంఘడ్, బాఘ్‌పట్, మీరట్ సహా 15 సీట్లను బిజెపి గెలుచుకుంది.

‘మహా సంపర్క్ అభియాన్’ లో భాగంగా యూపీ బిజెపి మైనారిటీ మోర్చా కున్వర్ బాసిత్ అలీ ప్రచారాన్ని ప్రారంభించారు. బిజెపి తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం గురించి నెల రోజులపాటు ఈ ప్రచార కార్యక్రమంలో ఊదరగొడతారు.

ఈ ప్రచారంలో ముస్లింల వద్దకు వెళ్లి ‘మోడీ మిత్రులను’ తయారుచేసుకుంటారు. బిజెపి ప్రభుత్వం పాలసీలు, సందేశాలను మైనారిటీలకు తెలుపుతారు. మైనారిటీల కోసం మోడీ ప్రారంభించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. పిఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌లు…దాదాపు 4.5 కోట్ల మంది ముస్లింలు ప్రయోజనం పొందారని వివరించనున్నారు. ఇంతేకాక కరోనా మహమ్మారి కాలంలో 2 కోట్ల మంది ముస్లిం జనాభాకు ఉచిత రేషన్ పథకం ప్రయోజనాలు అందించారని తెలుపుతారు.

మదర్సాలలో, సూఫీయిజం పాటించే కమ్యూనిటీలలో జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించాలని మోర్చా ప్రణాళిక రచించుకుంది. సూఫీలు బిజెపికి మద్దతు ఇవ్వాలని అలీ కోరారు. ఇదిలా ఉండగా అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ బిజెపితో ప్రధానంగా తలపడనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News