Monday, January 20, 2025

అయోధ్యలో యుపి కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

అయోధ్య : ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి సమావేశం గురువారం అయోధ్యలో జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయోధ్యలో రామాలయ సంబంధిత మ్యూజియం ఏర్పాటు నిర్ణయం కూడా ఇందులో ఉంది. రాష్ఠ్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. సాధారణంగా యుపి కేబినెట్ సమావేశాలు లక్నోలో జరుగుతాయి. ఇందుకు భిన్నంగా అయోధ్యలో మంత్రి మండలి సమావేశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News