Monday, December 23, 2024

యుపి సిఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

UP CM Helicopter Emergency Landing

 

లక్నో: ఆదివారం నాడు హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మళ్లీ సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారని ప్రాథమిక సమాచారం. అక్కడినుంచి ప్రభుత్వ విమానంలో లక్నోకు బయలుదేరారని అధికారులు వెల్లడించారు. సీఎం యోగీ శనివారం వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేయడంతో పాటు అభివృద్ధి పనులు, శాంతిభద్రతలను సమీక్షించారు. వారణాసిలో రాత్రి బస చేసిన ఆయన ఆదివారం ఉదయం లక్నోకు బయలుదేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News