Monday, January 20, 2025

28 ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్లిన యుపి సిఎం

- Advertisement -
- Advertisement -

UP CM Yogi Adityanath meets mother

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఉత్తరాఖండ్‌ పంచూర్‌లోని తన పూర్వీకుల గ్రామంలో తల్లి సావిత్రీ దేవిని కలుసుకున్నారు. ఆమె ఆశీర్వాదం కోరుతూ ఆమె పాదాలను తాకారు. తన కుమారుడిని కలిసేందుకు ఉద్వేగానికి లోనైన ఆయన తల్లికి ముఖ్యమంత్రి శాలువాను బహుమతిగా అందజేశారు. యోగి ఆదిత్యనాథ్ ఇవాళ రాత్రికి తన కుటుంబంతో గడిపి, రేపు తన మేనల్లుడు పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమానికి హాజరుకానున్నారు. కుటుంబ సమేతంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి 28 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 2020లో కరోనావైరస్ మహమ్మారి మొదటి వేవ్ సమయంలో తన తండ్రి మరణించినప్పుడు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళలేకపోయానని ఒక ప్రకటనలో తెలిపారు. తన తల్లితో దిగిన ఫోటోను యోగి ట్వీట్టర్ లో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News