లక్నో : పాకిస్థాన్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఎండగట్టారు. సర్దార్ పటేల్ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తుంటే, సమాజ్‌వాదీ నేత మాత్రం పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను ఆరాధిస్తున్నారని ఓ ట్వీట్‌లో విమర్శించారు. వాళ్లు జిన్నా ఆరాధకులు, మేం సర్దార్ పటేల్‌ను అభిమానిస్తాం. పాకిస్థాన్ అంటే వాళ్లకు చాలా ఇష్టం. మేం భారతి కోసం ప్రాణాలిస్తాం. అని యోగి ఆదిత్యనాధ్ ట్వీట్ చేశారు. దీనికి ముందు, పాకిస్థాన్ రాజకీయ శత్రువు మాత్రమేనని, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని అఖిలేశ్ యాదవ్ ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడే జిన్నా పేరును ఎందుకు లేవనెత్తుతారక్ష తనకు అర్థం కావడం లేదని , తాము రైతుల గురించి మాట్లాడుతుంటే వాళ్లు జిన్నా ప్రస్తావన చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ విమర్శించారు.
పటేల్ మాకు… జిన్నా వాళ్లకు : యోగి ఆదిత్యనాధ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -