Sunday, September 29, 2024

జులై 2న రాహుల్ గాంధీ హాజరు కావాలి: యుపి కోర్టు

- Advertisement -
- Advertisement -

సుల్తాన్‌పూర్(యుపి): కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపిస్తూ దాఖలు చేసిన పరువునష్టం కేసులో జులై 2వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎంపి-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసులో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రాంప్రతాప్ అనే వ్యక్తి చేసిన అభ్యర్థనను పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోష్ కుమార్ పాండే వ్యతిరేకించారు. రాంప్రతాప్ అనే వ్యక్తి బాధితుడిని కాని ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి కాని కాదని పాండే వాదించారు.

అయితే పాండే వాదనను రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా తోసిపుచ్చారు. అయితే ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రాం ప్రతాప్ అభ్యర్థనను కొట్టివేస్తూ జులై 2న తుదపరి విచారణ రోజున రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 2018లో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు దాఖలైంది. బిజెపి నాయకుడు విజయ్ మిశ్రా ఈ కేసు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News