Monday, December 23, 2024

మరుగుతున్న బెల్లం పాకంలోకి యువతి తోసివేత.. ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బాగ్‌పత్(యుపి): ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో బెల్లం తయారీ యూనిట్‌లో లైంగిక వేధింపులు ప్రతిఘటించిన 18 ఏళ్ల దళిత యువతిని మరుగుతున్న వేడి బెల్లం పాకంలో తోసివేసిన సంఘటన జరిగింది. తీవ్రమైన కాలిన గాయాల పాలైన ఆమె ఢిల్లీలోని జిటిబి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీస్‌లు ఆదివారం తెలియజేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. బినౌలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి ఎంపి సింగ్ చెప్పిన వివరాల ప్రకారం బాధితురాలు ముజఫర్‌నగర్‌కు చెందిన యువతి. గ్రామంలో ప్రమోద్‌కు చెందిన బెల్లం తయారీ యూనిట్‌లో పనిచేస్తోంది.

బుధవారం ఆమె బెల్లం తయారీ యూనిట్‌లో పనిచేస్తుండగా ప్రమోద్, రాజు, సందీప్ ఆమెను లైంగికంగా వేధించారని, అనుచితంగా ప్రవర్తించారని, ఆమె ప్రతిఘటించడంతో ఆమెను వేడి బెల్లం పాకంలో తోసివేశారని బాధితురాలి సోదరుడు శనివారం బినౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమెను చంపాలనే ఇలా చేశారని ఆరోపించాడు. కులంపేరుతో ఆమెను దూషించారని ఆరోపించాడు. ఈ సంఘటన తరువాత ఆ ముగ్గురు పరారయ్యారని పేర్కొన్నాడు. ఆమె సోదరుని ఫిర్యాదుపై నిందితులు ప్రమోద్, రాజు, సందీప్ లపై సెక్షన్లు 354, 504,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సింగ్ చెప్పారు. ఈ సంఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News