Monday, December 23, 2024

యుపిలో దళిత మహిళపై హత్యాచారం..శరీరాన్ని ముక్కలుగా నరికిన దుండగులు

- Advertisement -
- Advertisement -

బంద: ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక 40 ఏళ్ల దళితమహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమెను హతమార్చి శరీరాన్ని ముక్కలుగా నరికారు. ఇక్కడకు సమీపంలోని గిర్వాన్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రాజ్‌కుమార్ శుక్లా అనే వ్యక్తికి చెందిన పిండి మిల్లును మంగళవారం శుభ్రం చేయడానికి వెళ్లిన ఆ దళిత మహిళ కోసం ఆమె 20 ఏళ్ల కుమార్తె అక్కకు వెళ్లగా గదిలోపల నుంచి తన తల్లి ఆర్తనాదాలు ఆమెకు వినిపించాయి. తలుపులు లోపల నుంచి లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో ఆమె సహాయం కోసం అరిచింది. కొద్ది సేపటి తరువాత తలుపులు తెరుచుకోవడంతో లోపలకు వెళ్లి చూడగా తన తల్లి మృతదేహం మూడు ముక్కలుగా నరికివేసి ఉంది.

వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మిల్లు యజమాని రాజ్‌కుమార్ శుక్లాతోపాటు అతని సోదరులు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై కేసు నమోదు చేసినట్లు గిర్వాన్ పోలీసు స్టేషన్ అధికారి సందీప్ తివారీ గురువారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా..ఈ దారుణ ఘటనపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. దళిత మహిళపై అతాచారానికి పాల్పడిన దుంగడులు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం తనను కలచివేసిందని, ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలు భయంతో జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News