Monday, December 23, 2024

డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో పుట్టిన రోజు వేడుకలో పాల్గొని డ్యాన్సులతో అలరించిన ముగ్గురిలో ఒకరిని కొందరు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే పార్టీకి రప్పించిన ముగ్గురు డ్యాన్సర్లు తిరిగి వెళ్లిపోతుండగా, ఒక డ్యాన్సర్‌ను పార్టీలో పాల్గొన్న ఆరుగురు కిడ్నాప్ చేసి కారులో శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు మొదట లక్నో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసినా పోలీస్‌లు పట్టించుకోక పోయేసరికి ఉన్నావో సదర్ లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. డ్యాన్సర్‌ను వైద్య పరీక్షల కోసం పంపారు. నిందితులు ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News