వెబ్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో&నేరస్థులను పట్టుకునేందుకు, నేరాలను అరికట్టేందుకు ఒక వినూత్న శాస్త్రీయ పద్ధతిని ఉత్తర్ ప్రదేశ్ డిజిపి విజయ్ కుమార్ కనిపెట్టారు. పంచాంగాన్ని నమ్ముకోవాలంటూ ఆయన పోలీసు అధికారులకు సలహా ఇచ్చారు.
ఆయన విశ్లేషణ ప్రకారం అమావాన్య రోజులలో నేరాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ కారణంగా హిందూ పంచాగాన్ని పరిగణనలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలంటూ డిజిపి ఒక వీడియో సందేశంలో పోలీసు అధికారులకు సూచించారు. అమావాస్యకు ఒక వారం ముందు, ఒక వారం తర్వాత రాత్రి వేళల్లో నేరాలు అధికంగా జరుగుతాయని డిజిపి తెలిపారు.
చంద్రుడి క్షీణ, ఉద్దీపన దశలను హెచ్చరికగా తీసుకుని పోలీసు భద్రతను పెంచుకోవాలంటూ ఆయన అధికారులను కోరారు. హిందూ పంచాగాన్ని గమనిస్తుంటే నేరస్థులు ఏఏ రోజులలో నేరాలు అధికంగా చేస్తారో కనిపెట్టడం చాలా సులువంటూ కూడా ఆయన ఆ వీడియోలో తేల్చివేశారు.
పూర్ణ అమావాస్య, సప్తమి వంటి తిథులలలో చీకటి రాత్రులు ఉంటాయని, ఆ రోజులనే నేరస్థులు నేరాలు చేయడానికి నమ్ముకుంటారని కూడా ఆయన విశ్లేషించారు. చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు, అర్ధచంద్రుడు ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు అమావాస్య వస్తుంది వంటి విషయాలపై పోలీసులు జ్ఞానం పెంచుకుని, అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హితవు చెప్పారు.
#WATCH | UP DGP Vijay Kumar says, "We discuss how Policing is done on the basis of the movement of the moon. To know the movement of the moon, the easiest method is Hindu Panchang as per which we we regulate the Police movement. It is very important for the public to know this so… pic.twitter.com/xRuF1lzvD4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 21, 2023