Tuesday, January 21, 2025

డబ్బుల కోసం గుండెలకు గండి..

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ డాక్టరు ఏకంగా ప్రాణప్రధాన గుండెలతో సయ్యాటకు దిగాడు. నాణ్యత లేని గుండె పేస్‌మేకర్స్ అమర్చడంతో 200 మందికి పైగా గుండెజబ్బుల రోగులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందాల్సి వస్తోంది. ప్రామాణిక పేస్‌మేకర్లకు అయ్యే ఖరీదుతో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువగా డబ్బులు తీసుకుని ఈ కవాటాలను అమర్చినట్లు పోలీసులు నిర్థారించారు. ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కార్డియాలాజిస్టు డాక్టర్ సమీర్ సరాఫ్ నిర్వాకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వాసుపత్రి యుపి యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (యుపియు ఎంఎస్) పరిధిలోకి వస్తుంది.

పలువురు ఈ గుండె ఆపరేషన్ల తరువాత ఆసుపత్రుల పాలుకావడంతో ఈ డాక్టరును గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఈ డాక్టరు ఓ నాసిరకం పేస్‌మేకర్ అమర్చడంతో ఓ లాయరు భార్య కన్నుమూసింది. అప్పుడు ఈ డాక్టరుపై కేసు పెట్టారు. కాగా ఈ డాక్టరు 600 మందికి అమర్చాడు. ఇందులో 200కు పైగా అప్రమాణికం అని ఇపపటి దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్ సరాఫ్ ప్రతి ఒక్క ఆపరేషన్‌కు సర్కారీ డాక్టర్ అయి ఉండి కూడా రూ 4 లక్షల వరకూ ఫీజు తీసుకుంటూ వస్తున్నాడు. ఐసిడిల అమరికకు దిగుతున్నాడు. ఈ క్రమంలో పలు విధాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News