Tuesday, December 24, 2024

పాకిస్తాన్ పేరెత్తితే మన ఆకలి తీరుతుందా?: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

UP Election 2022: Priyanka Gandhi Slams BJP

లఖ్‌నవూ: ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రజోపయోగం లేని చర్చలను తెరపైకి తెస్తున్నారని, అధికార బిజెపిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేక వారిని మభ్యపెట్టేందుకు ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు. పాకిస్తాన్ పేరు తెస్తేనో, బుల్డోజర్లు నడిపిస్తేనో ప్రజల కడుపు నిండదని, ప్రజలకు అవసరమైన పనుల గురించి చర్చ జరగాలని ఆమె కోరారు. యూపీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

UP Election 2022: Priyanka Gandhi Slams BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News