Friday, November 22, 2024

యోగి ప్రయివేట్ కుట్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని మోడీ సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ మేరకు గురువారం రాత్రి 10 గంటల నుండి 72 గంటల పాటు వారు నిరవధిక సమ్మె చేపట్టారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జెన్‌కో పవర్ ప్లాంట్లను ప్రైవేటుకు ఇవ్వాలని యూపిలో యోగి సర్కారు కుట్రలు పన్నిందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ వారు ఆందోళన కు దిగారు. ప్రైవేటీకరణ చేస్తే దేశ వ్యాప్తంగా ఉద్య మం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వి ద్యుత్ సంస్థల ప్రైవేటీ కరణను వెంటనే నిలిపి వే యాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు ధ ర్నా చేపట్టడంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చే సేందుకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ కుట్రలు చేస్తున్న ట్లు విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ మేరకు విద్యుత్ కర్మచారి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 10 గంట ల నుంచి 72 గంటల పాటు విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్స్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో 2 x 800 ఎండబ్లూ సామర్థం గల స్టేట్ జెన్‌కో పవర్ ప్లాంట్‌ను అంపారా, ఓబ్రా దానికి సంబంధించిన ట్రాన్స్‌మిషన్ లైన్స్ కూడా ప్రైవేటుకు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దానిపై గత సంవత్సరం డిసెంబర్ 3న విధులు బహిష్కరించిన సమయంలో ఉత్తర ప్రదేశ్ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా మేము ఎటువంటి ప్రైవేటైజేషన్‌కు పూనుకోవడం లేదని చెప్పింది.

ఒ కవేళ ఏమైనా చర్యలు తీసుకునేట్లయితే మిమ్మల్ని (ఉత్తర ప్రదేశ్ విద్యుత్ కర్మచారి సంఘర్షణ సమి తి) సంప్రదిస్తామన్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంది దీన్ని తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కోసం పార్లమెంటులో అమెండ్‌మెంట్ బిల్ పెట్టాలని ప్రయత్నించినప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజల నుండి దేశంలో విద్యుత్ రంగంలో పని చేస్తున్న 25 లక్షల మంది విద్యుత్ ఉద్యోగుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన రాష్ట్ర ప్రభుత్వాలచే సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తుంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు విద్యుత్ రంగంను ప్రైవేటీకరణ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొంత మందికి వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకు ఈ ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడింది. కేంద్ర పర్భుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తాం అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్రంగా ఖండించి అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News