Sunday, December 22, 2024

అల్లుడితో కాపురం చేయడంలేదని కూతురు తలపై కర్రతో బాది…

- Advertisement -
- Advertisement -

లక్నో: కూతురు భర్తతో కాపురం చేయడంలేదని ఆమెను కన్నతండ్రి కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్టరం సిర్సా జిల్లా భరత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వేదపాల్ అనే వ్యక్తి తన భార్య కళావతి, కుమారుడు మిత్రసేన్, కోడలు మాయ, మనవడు హిమాన్షుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వేదపాల్ తన కూతురు మౌనికను 2008వ సంవత్సరంలో చరణ్ జిత్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో 2022 అత్తింటి నుంచి తన తండ్రి వద్దకు వచ్చింది. భర్తతో కలిసి ఉండలేనని మౌనిక తన తండ్రికి పలుమార్లు తెలిపింది.

అతడు మాత్రం అల్లుడు దగ్గరికి కూతురును పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు. జనవరి 11 మిత్రసేన్ తన భార్య, కుమారుడితో కలిసి కూలీ పనులకు వెళ్లాడు. కళావతి కూరగాయాల కోసం మార్కెట్‌కు వెళ్లింది. అల్లుడు దగ్గరకు వెళ్లాలని కూతురు మౌనికను కోరాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న వేదపాల్ ఓ కర్రను తీసుకొని ఆమె తలపై బాదాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News