- Advertisement -
లక్నో: సొంత బిడ్డను తండ్రి కాటేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లి లేకపోవడంతో ఆ బాలిక తన మేనత్త దగ్గర పెరుగుతోంది. సోమవారం రాత్రి మేనత్త దగ్గర పడుకున్న బాలికను తండ్రి ఓ రూమ్‌లో ఎత్తుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేస్తుండగా బాలిక గట్టగా ఏడ్వడంతో మేనత్త కేకలు వేయడంతో గ్రామస్థులు అతడిని పట్టుకున్నారు. బాలిక తాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. పది సంవత్సరాల క్రితం బాలిక చనిపోయిందని గురుసహాయ్ గంజ్ స్టేషన్ ఇంఛార్జి రాజ్‌కుమార్ సింగ్ తెలిపాడు.
- Advertisement -