Monday, December 23, 2024

యూపి ఆఖరి దశ ఎన్నికలు…అందరి కళ్లూ వారణాసి పైనే

- Advertisement -
- Advertisement -

UP final phase elections on Mar 07

వారణాసి: అత్యంత ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశలోకి అడుగుపెట్టాయి. అందరి కళ్లూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వారణాసి కేంద్రం పోలింగ్ పైనే ఉన్నాయి. వారణాసితోపాటు ఆజంఘర్, మయు,జాన్‌పూర్, ఘాజిపూర్, చందౌళి, మీర్జాపూర్, భాదోహి, సోన్‌భద్ర తదితర ఇతర ఎనిమిది జిల్లాలకు సంబంధించి 57 స్థానాలకు ఈనెల ఆఖరిది, ఏడో దశ పోలింగ్ 7న జరగనున్నది. ప్రధాని నరేంద్రమోడీతోపాటు అతిరథ, మహారధులైన విపక్ష నేతలంతా ప్రతిష్ఠాత్మకంగా ఈ నియోజక వర్గాలను పరిగణించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాని మోడీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఈనెల 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. వారణాసిలోని వివిధ ప్రాంతాల్లో 5న రోడ్‌షోలు నిర్వహిస్తారని, ఆ జిల్లా ఖజూరి గ్రామం వద్ద ర్యాలీలో పాల్గొంటారని వారణాసి విభాగం బిజెపి అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ చెప్పారు. కాంట్, వారణాసి ఉత్తర, వారణాసి దక్షిణ ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్న తరువాత కాశీవిశ్వనాధ ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారని తెలిపారు.

విపక్షాలకు చెందిన ప్రసిద్ధ నేతలు కూడా ఈ తుదిదశ నాడీ కేంద్రమైన వారణాసికి చేరుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఎస్‌పి అధినేత అఖిలేశ్ యాదవ్ , తన మిత్ర పక్షం ఆర్‌ఎల్‌డి నేత జయంత్ చౌదరితో కలసి గురువారం ఉమ్మడి ర్యాలీ నిర్వహించారు. ఎస్‌పి నేతృత్వంలో మిత్రపక్షాలన్నీ ఈ ర్యాలీలో పాల్గొని కాషాయ పార్టీకి గట్టి సవాలు విసురుతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, వారణాసి, పరిసర నియోజకవర్గాల్లో ఈపాటికే తమ ప్రచారాలను హోరెత్తించారు. శనివారంతో ఈ ఏడోదశ పోలింగ్ ప్రచారం ముగియనున్నందున ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈలోగా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటారో లేదో ఇంకా తెలీదు. అయినా ఆ పార్టీ ఎంపి సంజయ్ సింగ్, తదితర నాయకులు ఇక్కడ ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. ఈ దశ ఎన్నికల్లో ముఖ్యంగా సమాజ్ వాది పార్టీతోనే బిజెపి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. 2017 లో వారణాసి అసెంబ్లీ సెగ్మెంట్లలో అఖండ విజయం సాధించిన బిజెపి అదే స్థాయిలో విజయం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తోంది.

వారణాసిలో 3.25 లక్షల మంది వైశ్యులు, 3 లక్షల మంది ముస్లింలు, 2.5 లక్షల మంది బ్రాహ్మణులు, ఒబిసి కుర్మి సామాజిక వర్గమైన పటేళ్లు 2 లక్షల మంది, యాదవులు 1.5 లక్షల మంది, ఠాకూర్లు 1 లక్ష, దళితులు 80,000,ఒబిసిలు 70,000 మంది ఉన్నారు. బిజెపికి ఇంతవరకు గట్టి మద్దతుగా నిల్చిన బ్రాహ్మణ వర్గాలను ఎస్‌పి, ఇతర విపక్షాలు అక్కున చేర్చుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయితే గతంలోలా గుత్తగోలుగా ఒకే సామాజిక వర్గం మద్దతు ఏ పార్టీకి ఉండక పోవచ్చు. ఈసారి కులసమీకరణలు, ముస్లిం మైనార్టీ వర్గాల సమీకరణ అత్యంత స్థాయిలో సమాజ్‌వాది పార్టీ నిర్వహించగలగడంతో ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News