Wednesday, January 22, 2025

యుపి తొలి విడత పోలింగ్ ప్రశాంతం

- Advertisement -
- Advertisement -
UP first installment polling calm
ఓటు హక్కు వినియోగించుకున్న 60.17 శాతం ఓటర్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సరికి దాదాపు 6౦.17 శాతం పోలింగ్ జరిగినట్లు ఇసి వర్గాలు తెలిపాయి. అయితే పూర్తి వివరాలు అందాక ఈ శాతం కాస్త పెరిగే అవకాశం ఉంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 3 శాతం తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల్లో 63.5 శాతం పోలింగ్ జరిగింది. కాగా కొన్ని చోట్ల ఇవిఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురయినట్లు వార్తలు వచ్చాయని, వెంటనే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ బిడి రామ్ తివారీ చెప్పారు.

కైరానా నియోజకవర్గంలోని దుందుఖేడా గ్రామంలో పేదలను ఓటు వేయకుండా అడ్డుకున్నారంటూ సమాజ్‌వాది పార్టీ చేసిన ఆరోపణ గురించి అడగ్గా, ఈ విషయంపై విచారణ చేయాల్సిందిగా సంబంధిత జిల్లా అకలెక్టర్‌ను కోరినట్లు తివారీ చెప్పారు. కాగా సాయంత్రం 5 గంటల వరకు ఆగ్రాలో 56.61 శాతం, అలీగఢ్‌లో 57.25 శాతం, బాగ్‌పత్‌లో 61.35 శాతం, బులంద్‌షహర్‌లో 60.52 శాతం, గౌతంబుద్ధ నగర్‌లో 54.77శాతం, ఘజియాబాద్‌లో 54.77 శాతం, హాపూర్‌లో 60.50శాతం, మథురలో 58.51 శాతం, మీరట్‌లో 58.52 శాతం, ముజఫర్‌నగర్‌లో 62.14 శాతం, షామ్లిలో 61.78 శాతం పోలింగ్ జరిగినట్లు ఇసికి అదిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

పెళ్లికి ముందు ఓటేసిన వరుడు

కాగా సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చార్‌ఖంబ పోలింగ్ స్టేషన్‌లో గురువారం పెళ్లి చేసుకొంటున్న బలరాం అనే యువకుడు పెళ్లి ఊరేగింపునకు ముందు మోటారు సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. మథురలో ఓటర్లు ఉదయం దట్టమైన పొగమంచులోనే ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అయితే సమయం గడిచే కొద్దీ వాతావరణం మెరుగుపడింది. తొలి విడతలో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరిలో 73 మంది మహిళలున్నారు. తొలి విడతలో యోగిఆదిత్యనాథ్ మంత్రివర్గంలోని 9 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News