Saturday, November 16, 2024

యుపి మాజీ సిఎం కల్యాణ్‌సింగ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

UP former CM Kalyan Singh passes away

 

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు. 89 సంవ త్సరాల సీనియర్ బిజెపి నేత అయిన సింగ్ లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ (ఎస్‌జిపిపిఐఎంఎస్)లోని ఐసియూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విష మిం చడంతో చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ గవర్నర్ గా కూడా పనిచేసిన సిం గ్‌కు చాలా రోజులుగా ఆ సుపత్రికి చెందిన వివిధ విభాగాలతో కూ డిన వైద్యుల బృందం చికిత్స జరుపుతూ వస్తోంది. పలు అవయవాల వైఫల్యంతో చి కిత్సకు శరీరం సహకరించకపోవడంతో ఆ యన మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో బా బ్రీ మసీదు కూల్చివేత ఘటన దశలో ఆయన సిఎంగా ఉన్నారు. యుపికి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ముందుగా 1991 జూన్ నుంచి 1992 వరకూ, తరువాత 1997 సెప్టెంబర్ నుంచి నవంబర్ 99 వరకూ ముఖ్యమంత్రి పదవి నిర్వర్తించారు. 1992లో ఆయన సిఎంగా ఉన్నప్పుడే డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత ఘట్టం జరిగింది.. సిఎంగా ఆయన పదవీకాలాలు వివాదాస్పదంగా మారాయి. అయితే అయోధ్యలో రామజన్మభూమి సాకారానికి ఆయన హయాం దారితీసిందని బిజెపి సీనియర్ నేతలు స్పందించారు. కల్యాణ్ సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు, శ్రేణులు సంతాపం తెలిపారు.

కళ్యాణ్ సింగ్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News