Saturday, November 23, 2024

సిబిఎస్ఇలో 90 శాతం మార్కులు… కోమాలో విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నివేదిత చౌదరి(19) అనే అమ్మాయి 12వ తరగతి విద్యార్థిని. ఆమె తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయి జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయింది. అయినా అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని ఆమె ఆశ్చర్యకరమైన రీతిలో సిబిఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్‌లో 90 శాతం మార్కులు స్కోరుచేసింది. ఆమె 2014లో రోడ్దు ప్రమాదంలో తన తండ్రిని కూడా కోల్పోయింది. ఆమె జీవితం ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది.

Also Read: సిఎం సీటెవరిది

నివేదిత చౌదరి రోడ్డు ప్రమాదానికి గురయ్యాక కోమాలోకి వెళ్లిపోయింది. దాదాపు ఏడాది పాటు బెడ్‌పైనే ఉండిపోయింది. ఆ తర్వాత తొమ్మిది నెలలు ఒకరు ఊతం ఇస్తేగానీ నడువలేని స్థితిలో ఉండింది. ఇలాంటి స్థితిలో కూడా ఆమె తన చదువు విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. మీరట్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అయిన ఆమె సిబిఎస్‌ఈ పరీక్షల్లో 90.4 శాతం మార్కులు సాధించింది. ఆమె పరీక్షల సమయంలో ఓ రైటర్ సాయంతో పరీక్షలు రాసింది. ‘నేను ఫ్యాషన్ డిజైనింగ్’ చేయాలనుకుంటున్నాను అని ఆమె తెలిపింది. తన విజయానికి తన తల్లే కారణమని ఆమె క్రెడిట్‌నంత తన తల్లికే ఇచ్చింది. నివేదితకు ఆమె తల్లి నళిని కథలు, స్కూల్ సబ్జెక్స్ గురించి అవిఇవీ చెప్పి ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి పునరుద్ధరించింది.
నళిని తన టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి నివేదితను కనిపెట్టుకుంది. ఆమె భర్త విశాల్ చౌదరి మరణించాక కూతురు బరువు బాధ్యతలన్నీ నళినే తీసుకుంది. తన కూతురి విషయంలో తనకు ఎక్కువ సెలవులు అవసరం ఉండడంతో ఉద్యోగాన్నే వదిలేశానని నళిని తెలిపింది. ఆమెకు వచ్చే జీతం కూడా తక్కువే ఉండింది.

CBSE Siksha Sadan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News