లక్నో: ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. యుపి రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో క్రియాశీల కోవిడ్ కేసులు 600 మార్కు కంటే తక్కువగా ఉన్నందున కర్ఫ్యూలో సడలింపులు ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనావైరస్ కర్ఫ్యూలో బుధవారం నుండి ఉదయం నుంచి అమల్లోకి రానుంది. రాత్రి 7 నుండి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ (రోజంతా) అయితే అన్ని జిల్లాల్లోనూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా పరిస్థితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 797 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. సోమవారం, 2.85 లక్షల కోవిడ్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.2 శాతంగా ఉందన్న యోగి ఆదిత్యనాథ్ రికవరీ రేటు 97.9 శాతానికి పెరిగిందని చెప్పారు.
UP Govt Announces Relaxations In Covid Curfew