- Advertisement -
లక్నో: ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రివ్యూ అధికారులు(ఆర్‌ఓ), సహాయ రివ్యూ అధికారుల(ఎఆర్‌ఓ) నియాకాల కోసం ఫిబ్రవరి 11న నిర్వహించిన ప్రాథమిక పరీక్షను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం శనివారం రద్దు చేసింది. రు నెలల్లోగా మళ్లీ పరీక్షను నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని దర్యాప్తు చేసే బాధ్యతను ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్)కు ప్రభుత్వం అప్పగించింది. ఆర్‌ఓ, ఎఆర్‌ఓ నియామకాల కోసం ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 11న నిర్వహించిన పరీక్షను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
- Advertisement -