Thursday, January 23, 2025

పంతులమ్మను ముద్దు అడిగిన ఉపాధ్యాయుడు… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: పాఠశాలలో కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ను ముద్దు పెట్టమని అడిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. టీచర్లు, పిల్లల కోసం యుపి ప్రభుత్వం డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఉన్నావో ప్రాంతంలో  అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ముద్దు పెట్టమని అడిగాడు. సదరు టీచర్ ముద్దు పెట్టేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సదరు ఉపాధ్యాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు ఇలా దారి తప్పితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముద్దు పెట్టమని అడిగినప్పుడు లేడీ టీచర్ అతడి చెంపపై చెప్పుతో కొట్టాల్సిందని మరో నెటిజన్ కామెంటు చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News