Monday, January 20, 2025

పరీక్ష హాలుకు వచ్చిన పెళ్లి కొడుకు..

- Advertisement -
- Advertisement -

పెళ్లంటే నూరేళ్ల పంట… నిజమే. కానీ సంపాదన లేకపోతే ఆ పెళ్లి నూరేళ్ల తంటా. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే, ఆ పెళ్లి కొడుకు మ్యారేజీ హాలుకు వెళ్లేముందు పరీక్ష హాలుకు వచ్చి, పరీక్ష రాసి వెళ్లాడు!.

ఉత్తరప్రదేశ్ లోని మహోబా పట్టణంలో పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్ష జరుగుతోంది. మరో పది నిమిషాల్లో పరీక్ష మొదలవుతుందనగా, ఓ పెళ్లికొడుకు ఊరేగింపుతో సహా అక్కడికి వచ్చి, మిగిలిన అభ్యర్థులతోపాటు క్యూలో నించున్నాడు. తలపాగా, పొడవాటి కుర్తా ధరించి, పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులు అతని వద్దకు వచ్చి విషయం కనుక్కున్నారు.

మరికాసేపట్లో తన వివాహం జరగబోతోందనీ, ఇదే రోజు పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్ష కూడా ఉండటంతో పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసేందుకు రావలసి వచ్చిందనీ చెప్పాడు. ‘పెళ్లి ఎంత ముఖ్యమో, ఉద్యోగమూ అంతే ముఖ్యం కదా?’ అని అతను అనడంతో అతన్ని పోలీసులు క్యూలైను లోంచి తప్పించి, నేరుగా హాల్లోకి పంపారు. పరీక్ష రాశాక ఆ పెళ్లికొడుకు ఊరేగింపుతోపాటుగా మ్యారేజీ హాలుకి వెళ్లిపోయాడు. పలువురు అభ్యర్థులు, పోలీసులు అతనికి వీడ్కోలు పలుకుతూ బెస్టాఫ్ లక్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News