Monday, January 20, 2025

జవాన్ భార్యతో వివాహేతర సంబంధం… అశ్లీల వీడియోలు తీయమన్నందుకు భార్యను కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

లక్నో: జవాన్ భార్యతో మరో జవాన్ వివాహేతర సంబంధం పెట్టుకొని అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో సదరు జవాన్ భార్యను కత్తితో పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాయ్ బరేలీలో జరిగింది. దీంతో జవాన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మనోజ్ సేనాపతి అనే జవాన్ తన భార్య సుదేశ్నాతో కలిసి రాయ్‌బరేలీలో ఉంటున్నాడు. ఇంటి పక్కన ఉండే మరో జవాన్ నితీష్ పాండే భార్యతో మనోజ్ సేనాపతి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అశ్లీల వీడియోలతో పాండే భార్యను సేనాపతి బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో మార్చి 13న సేనాపతి ఇంటికి నితీష్ వెళ్లాడు.

సుదేశ్నా ఇంట్లో ఉండడంతో సేనాపతి గురించి అడిగాడు. సేనాపతికి ఫోన్ చేయాలని కోరడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసింది. సేనాపతితో పాండే ఫోన్‌లో మాట్లాడారు. తన భార్యతో ఉన్న అశ్లీల వీడియోలు, ఫోటోలను ఫోన్‌లో నుంచి తొలగించాలని అడిగాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో పాండేతో సుదేశ్నా గొడవ పెట్టుకుంది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని సుదేశ్నాపై దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. వెంటనే నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పాండేను అరెస్టు చేశామని ఎఎస్‌పి రాహుల్ బాటి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News