- Advertisement -
ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లా ఖాప్ పంచాయతీ మహిళలు జీన్ ప్యాంట్లు ధరించడంపై నిషేధం విధించింది. అలాగే పురుషులు షార్టులు ధరించరాదని ఆదేశించింది. ఇవన్నీ పాశ్చాత్యవస్త్రధారణలని, సంప్రదాయ భారతీయ వస్త్రధారణ పాటించాలని సూచించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే సంఘ బహిష్కరణ శిక్షకు గురవుతారని హెచ్చరించింది. పీపాల్షా గ్రామంలో చర్ధవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 2న ఈ పంచాయతీ జరిగింది. పంచాయతీ నిర్ణయాన్ని సామాజిక వర్గం నేత కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పురాన్ సింగ్ వెల్లడించారు.
UP Khap Panchayat bans women’s jeans
- Advertisement -