Tuesday, November 26, 2024

కొన్ని గంటలు కోటీశ్వరుడైన కూలీ.. జన్‌ధన్ ఖాతాలో రూ.2700 కోట్లు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో దినసరి కూలీ కొన్ని గంటల పాటు కోటీశ్వరుడయ్యాడు. అతడి జన్‌ధన్ ఖాతాలో రూ.2700 కోట్లు ఉన్నట్టు తెలుసుకుని షాక్ అయ్యాడు. రాజస్థాన్ లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్న 45 ఏళ్ల బీహారీ లాల్ ఇటుక బట్టీ మూతపడడంతో కన్నౌజ్ జిల్లాలోని సొంత ఊరికి ఇటీవల తిరిగి వచ్చాడు. రెండు రోజుల కిందట స్థానిక జనసేవా కేంద్రానికి వెళ్లి తన జన్‌ధన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.100 డ్రా చేశాడు. అయితే అతడి మొబైల్ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో తన బ్యాంకు ఖాతాలో రూ.2700 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్టు గమనించాడు. వెంటనే బ్యాంకు మిత్రా సిబ్బంది వద్దకు వెళ్లి తన ఖాతాను పరిశీలించాలని కోరాడు. బ్యాంక్ మిత్రా వ్యక్తి కూడా బీహారీ లాల్ ఖాతాను ఒకటికి మూడుసార్లు పరిశీలించి జన్‌ధన్ ఖాతాలో రూ.2700 కోట్లు ఉన్నాయని చెప్పాడు.

అంతేకాదు, అకౌంట్ స్టేట్‌మెంట్ ప్రింట్ కూడా తీసి ఇచ్చాడు. ఒక్కసారి కోటీశ్వరుడు కావడంపై బీహారీ లాల్ ఆశ్చర్యంతోపాటు ఆనందంతో సంబరపడ్డాడు. అయితే ఆ ఆనందం కొన్ని గంటల్లో ఆవిరైంది. తన బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి అక్కడ జన్‌ధన్ ఖాతా బ్యాలెన్సు చెక్ చేసుకోగా కేవలం రూ. 126 మాత్రమే ఉన్నాయి. బ్యాంకింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై దర్యాప్తు కోసం బీహారీ లాల్ బ్యాంక్ ఖాతాను కొంతసేపు స్తంభింప చేశారు.

UP labourer finds Rs 2700 crore in bank account

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News