Monday, December 23, 2024

యుపిలో కోర్టు గదిలో లాయరు హత్య

- Advertisement -
- Advertisement -

గజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఓ లాయర్‌ను ఆయన కార్యాలయంలోనే దుండగులు కాల్చిచంపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జిల్లా కోర్టు ఆవరణలోని ఈ లాయర్ ఆఫీసు రూంలోనే జరిగింది. కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో పోలీసు భద్రత ఉన్నప్పుడే ఈ కాల్పుల ఘటన జరిగింది. దీనితో కోర్టుకు వచ్చిన లాయర్లు, జనం పరుగులు తీశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో లాయర్ మోనూ చౌదరి భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఈ లోగానే ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి ఆయనపై ఎక్కుపెట్టి నేరుగా కాల్పులు జరిపారని వెల్లడైంది. తూటాలతో కుర్చీలో చౌదరి రక్తసిక్త భౌతికకాయం తరువాత కన్పించింది. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి తరలివచ్చారు. ఈ ప్రాంతంలోని సిసిటీవీ కెమెరాల ఫుటేజ్‌ల ద్వారా దుండగులను పసికడుతున్నట్లు డిసిపి నిపుణ్ అగర్వాల్ తెలిపారు. లాయర్ భౌతిక కాయాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News