Wednesday, January 22, 2025

బాలికతో పారిపోయిన టూరిస్ట్….. గొంతు నులిమి…

- Advertisement -
- Advertisement -

లక్నో: బాలికకు మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి ఆమెతో లేచిపోయాడు. అనంతరం ఆమెను హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హపూర్ జిల్లా భీమ్ నగర్‌కు చెందిన అశు అనే వ్యక్తి జమ్ము కశ్మీర్‌కు వెళ్లాడు. అక్కడ మహినూర్ అనే బాలికను పరిచయం చేసుకొని మాయ మాటలతో తనతో సొంతూరుకు తీసుకెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో బాలికను గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు అశును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా బాలిక ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. శవ పరీక్షలో మాత్రం బాలికను గొంతు నులిమి హత్య చేసినట్టుగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి అశును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక తండ్రి తాలిబ్ అలీ జీవనోపాధి నిమిత్తం పది సంవత్సరాల క్రితం అస్సాం నుంచి జమ్ముకు వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News