Wednesday, January 22, 2025

కోడి కోసం ఆశపడి పులిబోనులో చిక్కాడు(ఫన్నీ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: పులికి ఎరగా పెట్టిన కోడిపుంజు కోసం వెళ్లి ఓ వ్యక్తి పులిబోనులో చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా బసెందువా గ్రామంలో ఈ అరుదైన వింత ఘటన చోటు చేసుకుంది. పరిసరాలలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు బసెందువా గ్రామంలో ఒక ఇనుప బోనును ఏర్పాటు చేసి అందులో పులికి ఎరగా కోడి పుంజును ఉంచారు. అయితే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోడి పుంజును కాజేయాలన్న దురుద్దేశంతో బోనులోకి వెళ్లాడు. అంతలోనే బోను మూసుకుపోవడంతో అతగాడు లోపలే చిక్కుకుపోయాడు. తనను రక్షించండి బాబోయ్ అంటూ అతను చేస్తున్న ఆర్తనాదాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సంగతి తెలుసుకునన అటవీ అధికారులు అక్కడకు చేరుకుని పులి బోనులో నుంచి ఆ వ్యక్తిని విముక్తుడ్ని చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News