Sunday, January 19, 2025

అప్పు ఇచ్చిన పాపానికి శవమై తేలాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: హిందీ సినిమా ఆధారంగా 60 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోడీనగర్‌లో ఉమేష్ అనే భూస్వామి నివసిస్తున్నాడు.  అంకిత్ అనే వ్యక్తి పిహెచ్ చదువుకుంటూ ఉమేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వ్యాపార పనుల నిమిత్తం అంకిత్ వద్ద నుంచి ఉమేష్ 60 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వమని పలుమార్లు ఉమేష్‌ను అంకిత్ అడగడంతో అతడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

హిందీ సినిమా ఆధారంగా హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్ 6న అంకిత్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేశాడు. ఉమేష్ తన స్నేహితుడి కారుతో మృతుడి శరీర భాగాలను తీసుకొని ఖటౌలి ప్రాంతంలో గంగా నదిలో ఒక ముక్కను పడేశాడు. రెండు ముక్కలను ముస్సోరీ ప్రాంతంలోని గంగా నదిలో పడేశాడు. నాలుగో ముక్కను ఈస్ట్రెన్ పెరిఫిరాల్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై పడేశాడు. అంకిత్ అకౌంట్ లో ఒక కోటి రూపాయలు ఉన్నాయి. ఉమేష్ అక్టోబర్ 6న 40 లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. తరువాత నెట్ బ్యాకింగ్ ద్వారా 21 లక్షల రూపాయలను అంకిత్ ఎకౌంట్ నుంచి తన ఎకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అంకిత్ ఎకౌంట్ ఆధారంగా ఉమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలను ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News