Thursday, January 23, 2025

పిల్లిని దొంగిలించాడనే అనుమానం.. యుపిలో 30 పావురాల వధ

- Advertisement -
- Advertisement -

షాజహాన్‌పూర్ : ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి పొరుగింటికి చెందిన 30 పావురాలను చంపేశాడు. పొరుగింటి వ్యక్తి పక్షుల కోసం తాను పెంచుకుంటున్న పిల్లిని ఎత్తుకెళ్లాడనే కక్షతో ఈ వ్యక్తి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోందని షాజహాన్‌పూర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే పావురాల చంపివేత తరువాత అబిడ్‌కు చెందిన పిల్లి తిరిగి ఇంటికి వచ్చింది. కానీ పక్షుల ప్రేమికుడు అయిన వారిస్ అలీ తాను ముచ్చటపడి పెంచుకుంటున్న 78 పావురాలలో 30 వరకూ పోగొట్టుకోవడంతో బాధతో పోలీసులను ఆశ్రయించారు. ఏళ్లుగా తాను ఎంతో కష్టపడి ఈ పావురాలను పెంచుకుంటూ వస్తున్నానని , ఇప్పుడు ఇవి తిరిగి వస్తాయా? పిల్లి కోసం ఇంత దారుణానికి పాల్పడుతారా? అని అలీ వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News