Sunday, December 22, 2024

యుపిలో కర్కశ సోదరుడు.. ఐదుగురి నరికివేత

- Advertisement -
- Advertisement -

మొయిన్‌పురి : ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి వావివరుసలు లేకుండా ఐదుగురి ప్రాణాలు తీశాడు. తమ్ముళ్లు, మరదలు, బావమరిది, స్నేహితుడిని మట్టుపెట్టాడు. నలుగురు కుటుంబ సభ్యులను, స్నేహితుడిని గొడ్డలితో నరికి చంపిన విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత తనను తాను పిస్టల్‌తో కాల్చుకుని చనిపొయ్యాడు . మొయిన్‌పురి జిల్లాలోని గోకుల్‌పూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగిందని జిల్లా ఎస్‌పి వినోద్‌కుమార్ తెలిపారు. తెల్లవారుజామున ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని వివరించారు.

Also Read: మోడీ పర్యటన చైనాతో పోటీకి కాదు..

గోకుల్‌పూర్ అర్సారాకు చెందిన 28 ఏండ్ల శివ్‌వీర్ యాదవ్ తన ఇంట్లోనే సోదరులు బుల్లాన్ యాదవ్, సోనూ యాదవ్, సోనూ భార్య సోనీని, బావ మరిది సౌరభ్‌ను, స్నేహితుడు దీపక్‌ను క్రూరంగా నరికి చంపినట్లు తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. ఈ వ్యక్తి ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనేది వెల్లడికాలేదు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News