Monday, December 23, 2024

ప్రియుడితో పారిపోయిన కూతురు…. చంపి పాతిపెట్టిన తండ్రి

- Advertisement -
- Advertisement -

లక్నో: తన కూతురు ప్రియుడుతో పారిపోయిందనే కోపంతో ఆమెన కన్నతండ్రి చంపి తన పొలంలో గుంత తీసి పాతిపెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్చానా ప్రాంతం హిందూపూర్ గ్రామంలో లాలన్ అలీ అనే వ్యక్తి తన రెండో భార్య. ఇద్దరు కూతుర్లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గతంలో మొదటి భార్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియాలో చాందిని మిర్జాపూర్ యువకుడితో పరిచయం ఏర్పడడంతో ప్రేమలో పడింది. చాందిని తన ప్రియుడితో కలిసి ముంబయికి పారిపోయింది. తన సొదరిని కూడా తన వెంట తీసుకెళ్లింది.

ముంబయికి వెళ్లిన తరువాత ఇద్దరు డబ్బులు లేకపోవడంతో తన సోదరిడికి పోన్ చేసింది. ముంబయి నుంచి తీసుకుని తన హిందూపూర్‌కు తీసుకెళ్లాడు. చాందిని మాత్ర తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడడంతో తన తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఎలక్ట్రిక్ హీటర్ సహాయంతో తన కూతురును చంపేశాడు. మార్చి 24న అనంతరం మృతదేహాన్ని తన పొలంలో గుంత తీసి పాతిపెట్టాడు. చాందిని కనిపించకపోవడంతో పోలీసులకు చుట్టుపక్కల వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి లాలన్ అలీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గుంతలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News