Sunday, December 22, 2024

ఇద్దరు తమ్ముళ్లతోసహా ఐదుగురిని చంపి అన్న ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మెయిన్‌పురి: ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక దారుణం చోటుచేసుకుంది. మెయిన్‌పురి నగరంలోని గోకుల్‌పరూర్ అర్సారా ప్రాంతంలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు నలుగురితోపాటు తన స్నేహితుడిని కూడా గొడ్డలితో నరికి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

శివ్ వీర్ యాదవ్(28) అనే వ్యక్తి తన సోదరులు భుల్లన్ యాదవ్(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోని(20), బావమరిది సైరభ్(23)తోపాటు మిత్రుడు దీప్(20)ను గొడ్డలితో నరికి చంపివేశాడు. తన భార్య డోలి(24)తోపాటు తన మేనత్త సుష్మ(35)ను కూడా శివ్ వీర్ యాదవ్ గాయపరిచినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత శివ్ వీర్ తనను తాను పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్‌పి వినోద్ కుమార్ తెలిపారు.

గాయపడిన వారిని మెయిన్‌పూరిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎస్‌పి చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు ఆయన చెప్పారు. ఈ హత్యల వెనుక కారణం ఏమిటో ఇంకా బయటకు రాలేదని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News