- Advertisement -
లక్నో: ఓ వ్యక్తి తన స్నేహితులతో మద్యం తాగుతుండగా తుపాకీ తీశాడు. తుపాకీ తీసినప్పుడు మరో వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేస్తున్నాడు. తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేసి పైకి కాల్చాడు. రికార్డు చేసిన వ్యక్తికి బుల్లెట్ తగిలి ఘటనా స్థలంలో పడిపోయాడు. వెంటనే స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ పని చేస్తుందా లేదా చెక్ చేద్దామని పేల్చానని నిందితుడు చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు తూటా తన స్నేహితుడికి తగిలిందన్నాడు. తాను కావాలని షూట్ చేయలేదన్నాడు.
- Advertisement -