Wednesday, January 22, 2025

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: వంట వండడానికి మాంసం తీసుకరాలేదని భర్త భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో రోరావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మబుద్ నగర్ ప్రాంతంలో సాగిర్(35), గుడ్డో(30) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో వంట వండడానికి మాంసం తీసుకరాలేదని భార్యతో భర్త గొడవ పడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పిల్లలు చూస్తుండగానే కత్తి తీసుకొని భార్య గొంతు కోశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు భర్తను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం అలీగఢ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడి అరెస్టు చేయడంతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి కుల్దీప్ గునావత్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News