Wednesday, January 22, 2025

నడి రోడ్డుపై మద్యం తాగి తుపాకులతో చిందులు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: పట్టపగలు నడిరోడ్డుపై మద్యం తాగుతూ చేతుల్లో తుపాకులు పట్టుకుని చిందులేసిన అల్లరి మూకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై దర్యాప్తు ప్రారంభించిన ఘజియాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారు యజమానిని నగరానికి చెందిన చిరంజీవ్ విహార్ నివాసి రాజా చౌదరికి గుర్తించారు. ఫిబ్రవరి 5న ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

నిందితులపై ఇందిరాపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి చెప్పారు. రోడ్డుపై కారును నిలిపివేసి ఆరుగురు వ్యక్తులు అక్కడే మద్యం సేవించారు. వీరిలో ఒక వ్యక్తి రెండు తుపాకులను మెడపై వేసుకుని డ్యాన్సు చేయగా మరో వ్యక్తి తుపాకీతో గాలిలో కాల్పులు జరిపాడు. ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యాలను చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇప్పటి వరకు నిందితులలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

నవోదయ టైమ్స్ సౌజన్యంతో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News