లక్నో : ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ కాన్పూర్ కోర్టులో తనకు శిక్ష ఖరారు తీర్పు జారీ దశలో అక్కడి నుంచి పారిపొయ్యాడు. రాష్ట్ర చిన్న మధ్య, సూక్ష్మ సంస్థలు, ఖాదీ మంత్రిగా రాకేష్ ఉన్నారు. తను కోర్టు నుంచి వెళ్లిపోయినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. 1991 నాటి ఓ కేసులో రాకేష్ దోషిగా నిర్థారణ అయ్యారు. అయితే కాన్పూర్ కోర్టు ఆయనకు శిక్ష, జైలు కాలపరిమితి తీర్పు వెలువరించాల్సి ఉంది. యుపి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ వీడి బిజెపిలో చేరారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై ఆయన శనివారం ఆయనను కోర్టు దోషిగా నిర్థారించింది. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకోవడానికి ముందుగానే , శిక్షలపై వాదనల ఆరంభ దశలోనే మంత్రి గుట్టుచప్పుడు కాకుండా కోర్టు హాల్ నుంచి జారుకున్నాడని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇతర విపక్ష నేతలు ఆరోపించారు. అయితే తాను శనివారం రాత్రి వేరే జిల్లాలో ఓ అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి వచ్చిందని , దీనికి తాను వెళ్లినట్లు, దీనిపై విపక్షాలు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని మంత్రి విమర్శించారు.