Thursday, January 23, 2025

యూపీ మంత్రి రాకేష్ సచన్‌కు ఏడాది జైలు

- Advertisement -
- Advertisement -

UP minister Rakesh Sachan jailed for year

లక్నో : యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో చిన్న, మధ్య తరహా సంస్థలు, ఖాదీ శాఖల మంత్రి రాకేష్ సచన్‌కు 1991 ఆయుధాల చట్టం కేసులో కాన్పూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రూ. 1500 జరిమానా కూడా విధించింది. కోర్టు దోషిగా ప్రకటించి , శిక్షపై నిర్ణయం తీసుకునే లోపు కోర్టు నుంచి సచన్ జారుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చుతూ ఇవన్నీ వదంతులేనని చెప్పారు. తనపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సచన్ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అక్రమ ఆయుధాల కేసులో ఆయనను దోషిగా పేర్కొంటూ గత శనివారం కాన్పూర్ కోర్టు తీర్పు చెప్పింది. శిక్షను మాత్రం వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News