లక్నో: దంపతుల మధ్య గొడవ జరగడంతో ముగ్గురు పిల్లల ప్రాణాలు తల్లి తీసిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీత యాదవ్ అనే మహిళ తన భర్తతో గొడవ పుట్టింటికి వచ్చింది. గత కొన్ని రోజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భార్యకు భర్త ఫోన్ చేయడంతో గొడవ తారాస్థాయికి చేరుకుంది. తీవ్ర మనస్థాపంతో ముగ్గురు పిల్లలకు టీలో విష కలిపి ఇచ్చింది. టీ తాగిన వెంటనే అపస్మారక స్థితిలోకి పోవడంతో స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి రోహన్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాడు. మృతులు సుప్రియ(05), పీయూష్ యాదవ్(08), హిమాన్షు యాదవ్(10)గా గుర్తించారు. నాలుగో కుమారుడు బయట ఆడుకోవడంతో అతడు టీ సేవించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
టీలో విషం కలిపి… ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీసిన తల్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -