Monday, December 23, 2024

ఉత్తరప్రదేశ్ ఎంఎస్ఎంఈ కూ యాప్‌తో అవగాహన ఒప్పందం

- Advertisement -
- Advertisement -

లక్నో: మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ఒకే జిల్లా, ఒకే ప్రొడక్ట్’ చొరవను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కంటెంట్‌ని వారి వారి స్థానిక భాషలలో ఉపయోగించుకోడానికి మరియు వ్యక్తీకరించడానికి రూపొందించిన మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం అయిన కూ(koo) యాప్‌తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.

ఎమ్‌ఓయు (MoU)లో భాగంగా, కూ (Koo) తన ప్లాట్‌ఫాం పై 10 భాషల్లోని ఓడిఓపి (ODOP) కంటెంట్ మరియు ప్రొడక్ట్ లపై ప్రేక్షకులకు అవగాహన పెంచడానికి ఈ ప్రచారం ఉపయోగపడుతుంది. అలాగే కూ (Koo) కార్పొరేట్ బహుమతి కోసం ఓడిఓపి (ODOP) బహుమతులను కూడా కొనుగోలు చేస్తుంది. యూపీ ఓడిఓపి (UP – ODOP) యొక్క సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాలు, ప్రత్యేకించి ఇంగ్లీషు మాట్లాడని నివాసితుల కోసం, అలాగే స్థానిక కళాకారులు ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి మరియు దేశవ్యాప్తంగా వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు, ఎక్కువ మందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ఈ అవగాహనా ఒప్పందము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓడిఓపి (ODOP) హ్యాండిల్‌ను కూ (Koo) యాప్ @UP_ODOPలో మీరు చూడవచ్చు.

అదనపు చీఫ్ సెక్రటరీ శ్రీ నవనీత్ సెహగల్ IAS, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కూ (koo) కో-ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అప్రమేయ రాధాకృష్ణ గారితో ఎంఓయూపై సంతకం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ MSME మరియు ఎగుమతి ప్రమోషన్ అదనపు ముఖ్య కార్యదర్శి నవనీత్ సెహగల్ మాట్లాడుతూ, “కూ(Koo) తో ఈ అనుబంధం మా ఓడిఓపి(ODOP) ఉత్పత్తులను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేయడంలో సహాయపడుతుంది మరియు అనేక ప్రాంతీయ భాషలలో ఓడిఓపి(ODOP) చుట్టూ సంభాషణలను నడపడానికి సహాయపడుతుంది” అని తెలిపారు.

కూ సహ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “ఈ రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈ ఎంఓయూ(MOU) పై సంతకం చేయడం ఆనందంగా ఉంది. ఓడిఓపి(ODOP) తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంలో ఉత్తరప్రదేశ్(UP) అగ్రగామిగా నిలిచింది. స్థానిక కళాకారులు కళలను తీసుకువెళ్లి, భారతదేశం అంతటా వివిధ భాషలలో ప్రచారం చేయడం నిజంగా సంతోషకరం” అని తెలిపారు.

UP MSME Signs MoU with Koo App

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News