Monday, January 20, 2025

యూపి నగరపాలక సంస్థల ఎన్నికలు… 813 కార్పొరేటర్ల సీట్లలో బిజెపి విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని 75 జిల్లాలకు చెందిన మొత్తం 760 నగరపాలక సంస్థలక జరిగిన ఎన్నికల్లో మొత్తం 1420 కార్పొరేటర్ల స్థానాల్లో 813 స్థానాలను అధికార బీజేపీ కైవశం చేసుకోగలిగింది. ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ 191 స్థానాలను, బహుజన్ సమాజ్ పార్టీ 85 స్థానాలను దక్కించుకున్నాయి. జౌన్‌పూర్ జిల్లాలో ఖేతసరై నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ స్థానాన్ని సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి వసీమ్ వసీమ్ సాధించుకున్నారు. వసీమ్ 4215 ఓట్లు సాధించి తన సమీప బీజేపీ అభ్యర్థి రూపేష్‌ను (4151 ఓట్లు ) ఓడించగలిగారు. ది ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అభ్యర్థి ఈ పోటీలో మూడో స్థాయిలో నిలిచారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్రం లోని మొత్తం 17 మేయర్ స్థానాలను బీజేపీ సాధించుకుంది. వారణాసి, లక్నో, అయోధ్య, ఝాన్సీ, బరైల్లీ, మధురవృందావన్, మొరాదాబాద్, సహరన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, అలిగఢ్, షాజహాన్‌పూర్, ఘజియాబాద్, ఆగ్రా, కాన్పూర్,

గోరఖ్‌పూర్, ఫిరోజాబాద్, మీరట్ మేయర్లంతా బీజేపీ అభ్యర్థులే గెలిచారు. అయితే ఇతర స్థానిక సంస్థల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని సీట్లు దక్కించుకోవడం విశేషం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం 191 కార్పొరేటర్ల స్థానాలను సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) సాధించగా, తరువాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పి) 85, కాంగ్రెస్ 77, ఎఐఎంఐఎం 19,రాష్ట్రీయ లోక్‌దళ్ 10, ఆమ్ ఆద్మీపార్టీ 8, అజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) 5 , ఇండియన్ ముస్లిం లీగ్, జన్‌అధికార్ పార్టీ , పీస్ పార్టీ, ఎన్‌ఐఎస్‌హెచ్‌ఎడి పార్టీ ఒక్కొక్క స్థానాన్ని పొందాయి. నగరపాలిక పరిషద్ ఛైర్‌పర్సన్ కేటగిరిలో మొత్తం 199 స్థానాలకు బీజేపీ 89 గెలుచుకోగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు 41 సాధించారు. సమాజ్‌వాది పార్టీ 35, బీఎస్‌ఫి 16,ఆర్‌ఎల్‌డి 7, కాంగ్రెస్ 4, ఆప్, ఎఐఎంఐఎం చెరి మూడేసి సీట్లు, బీజేపీ మిత్ర పక్షం అప్నాదళ్ (సోనేలాల్ )చెరి ఒక్కో స్థానాన్ని పొందాయి.

నగరపాలిక పరిషద్ సభ్యుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం 5327 స్థానాలకు గాను 3130 స్థానాలు దక్కించుకుని సగానికి సగం (58.76 శాతం ) సాధించడం విశేషం. బీజేపీ 1360 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ఎస్‌పి 425, బీఎస్‌పి 191, కాంగ్రెస్ 91, ఆర్‌ఎల్‌డి 40, ఎఐఎంఐఎం 33, ఆప్ 30 సీట్లను పొందగలిగాయి. నగరపంచాయత్ ఛైర్‌పర్సన్ స్థానాలు మొత్తం 544లో బీజేపీ 191, ఇండిపెండెంట్లు 195 దక్కించుకున్నారు. ఎస్‌పి 78, బీఎస్‌పి 37, కాంగ్రెస్ 14 పొందగలిగాయి. నగరపంచాయత్ సభ్యుల పదవుల్లో మొత్తం 7177 స్థానాలకు గాను ఇండిపెండెంట్ అభ్యర్థులు 4824 స్థానాలను దక్కించుకున్నారు. బీజేపీ 1403,ఎస్‌పి 485, బీఎస్‌పి 215, కాంగ్రెస్ 77, ఆర్‌ఎల్‌డి 38 స్థానాలను పొంద గలిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News