ఫరూకాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో అల్‌ఖైదా దివంగత నేత లాడెన్ ఫోటోను తన కార్యాలయంలో గోడలపై పెట్టుకున్న విద్యుత్ శాఖ అధికారిని సస్పెండ్ చేశారు. విద్యుత్ సంస్థలో రవీంద్ర గౌతమ్ అనే వ్యక్తి సబ్ డివిజినల్ ఆఫీసరుగా ఉన్నారు. తన కార్యాలయ గదిలో ఒసామా బిన్ లాడెన్ ఫోటో పెట్టుకున్నారు. ఫోటో కింద శీర్షికగా ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ జూనియర్ ఇంజనీరు అనే వ్యాక్యాలు జతచేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియా ద్వారా ప్రచారం పొందింది. విషయాన్ని జిల్లా అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించారు. లాడెన్ ఫోటోను కార్యాలయం నుంచి తొలిగించారు. తాను లాడెన్ బొమ్మను పెట్టుకోవడాన్ని సస్పెండ్ అయిన అధికారి సమర్థించుకున్నారు. ఇందులో తప్పేమీలేదన్నారు. వ్యక్తులకు ఎవరైనా ఆరాధ్యులుగా ఉండవచ్చు. లాడెన్‌లో మరో కోణం ఉంది. ఆయన మంచి ఇంజనీరు. నైపుణ్యవంతుడు. ఈ కోణంలో ఆయన బొమ్మ పెట్టుకున్నాను. తప్పేమీ లేదు. అధికారులు తనను సస్పెండ్ చేయడం, లాడెన్ ఫోటో తీసేయడం గురించి స్పందించారు. ఆ ఫోటో తీసేస్తే తన వద్ద అనేకంగా లాడెన్ ఫోటోలు ఉన్నాయని అన్నారు.