- Advertisement -
లక్నో: పేపర్ లీకయిందన్న ఆరోపణలపై భారీ ఎత్తున నిరసనలు రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను శనివారం ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 17,18 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. వచ్చే ఆరు నెలల్లో ఈ పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. పరీక్షల పవిత్రతతో రాజీపడేది లేదని ఆయన ప్రకటించారు.
ఎవరైతే ఈ అవకతవకలకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించడమౌతుందని తన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. 60,244 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దాదాపు 48 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్ష సందర్భంగా అవకతకవలకు పాల్పడ్డారన్న ఆరోపణపై 244 మందిని అరెస్టు చేశారు.
- Advertisement -