Sunday, January 19, 2025

ఆరో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం… అరెస్టు

- Advertisement -
- Advertisement -

లక్నో న్యూస్: ఆరో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరో తరగతి అమ్మాయి తన ఇద్దరు తోబుట్టువులతో కలిసి ఓ స్కూళ్లో చదువుతోంది. స్కూల్ సమయం ముగిసిన తరువాత ప్రిన్సిపాల్ ఎక్స్‌ట్రా క్లాస్ పేరుతో బాలికను లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ చదువుతున్న తోబుట్టువులను కాలువలో పడేస్తానని బెదిరించాడు.

రెండు నెలల నుంచి బాలికను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నాడు. బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత నలతగా ఉన్నట్టు తల్లి గుర్తించింది. తల్లి కూతురిని ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో  వెంటనే తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత మూడు నెలల నుంచి ముగ్గురు పిల్లలు స్కూల్ ఫీజులు చెల్లించడంలేదని, దీంతో స్కూల్ ప్రిన్సిపాల్‌పై బాలిక తల్లి తప్పుడు ఆరోపణలు చేస్తుందని నిందితుడి సోదరుడు మీడియాకు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News