Friday, January 24, 2025

యూపీలో జీవిత ఖైదీల విడుదలలో సంస్కరణలు

- Advertisement -
- Advertisement -

UP lifetime prisoners

లక్నో:   ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం జైలు విధానంలో సవరణ తేవాలనుకుంటోంది. జీవిత ఖైదీలకు 60 ఏళ్ల వయస్సు నిండక ముందే విడుదల చేయాలన్న సడలింపు విషయమై పరిశీలిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం హత్య వంటి నేరంలో జీవిత ఖైదీగా ఉన్న వ్యక్తిని ఉపశమనం లేకుండా 16 ఏళ్ల జైలు జీవితం గడిపిన వ్యక్తిని, ఉపశమనంతో 20 ఏళ్ల జైలు జీవితం గడిపిన వ్యక్తిని విడుదల చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ విధానం అనేక మంది జీవిత ఖైదీలకు మేలు చేయగలదని యూపీ జైలు శాఖ డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా జైలులో రద్దీని కూడా తగ్గించగలదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జీవిత ఖైదు శిక్ష పడ్డ ఖైదీలను ప్రయాగ్‌రాజ్, వారాణాసి, ఫతేగఢ్, ఇటావా, బరేలి, ఆగ్ర కేంద్ర కారాగారాల్లో ఉంచుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జిల్లా జైలులు 63 దాకా ఉన్నాయి. జైలులో సత్ప్రవర్తనతో మెసిలిన ఖైదీలను లక్నోలోని మోడల్ జైలుకు పంపిస్తారు. ఇదిలావుండగా బరేలిలో ఓ మహిళా కేంద్ర కారాగారాన్ని కూడా తెరిచారు. ప్రస్తుతం యూపీలో అంతా కలిపి 1.14 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. కాగా వారిలో శిక్షపడిన ఖైదీలు 30000 మంది కాగా, జీవిత ఖైదు శిక్ష పడినవారు 12000 మంది ఉన్నారు. కొత్త విధానంలోకి వచ్చే ఖైదీల వివరాలు అందించాల్సిందిగా యూపీ కారాగార పాలన, సంస్కరణ సేవల శాఖ అన్ని కారాగారాలకు జూన్ మొదటి వారంలో లేఖ రాసింది. జీవిత ఖైదు పడిన వారిలో శిక్షా కాలం పూర్తి కాకుండా విడుదల చేయాలన్న విషయాన్ని ‘విడుదల ప్రతిపాదన కమిటీ’ నిర్ణయిస్తుందన్న క్లాజ్‌ను కూడా పెట్టారు. జీవిత ఖైదీలను ఇదివరలో రిపబ్లిక్ డే, విమెన్స్ డే, వరల్డ్ హెల్త్ డే, లేబర్ డే, వరల్డ్ యోగా డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి నాడు విడుదల చేస్తుండేవారు. కాగా ఇప్పుడు ఈ ఏడు రోజులకు తోడు కొత్త విధానం ప్రకారం టీచర్స్ డే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ రోజున కూడా విడుదల చేయాలని జోడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News