Monday, December 23, 2024

అసభ్యకర దృశ్యాలతో వీడియో వైరల్… హెడ్‌మాస్టర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

బహ్రయిచ్ (ఉత్తర ప్రదేశ్ ) : మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు వీడియో దృశ్యాలు వైరల్ కావడం, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్కూల్ హెడ్‌మాస్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని విషేశ్వర్‌గంజ్ బ్లాక్ శివ్‌పుర్ బైరాగ్ ప్రైమరీ స్కూలులో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు చెందిన హెడ్ మాస్టర్ దుర్గాప్రసాద్ జైస్వాల్ రోజూ మద్యం సేవించి స్కూలుకు వస్తున్నాడని, మద్యం మత్తులో నిద్రపోతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీనికి సాక్షంగా ప్రసారమైన వీడియోలో స్కూలులో ఆయన మద్యం మత్తులో దిగంబరంగా నిద్రపోయినట్టు దృశ్యాలు కనిపించాయి. హెడ్‌మాస్టర్ అసభ్యకర చర్యలకు స్కూలుకు బాలికలు ఎవరూ వెళ్లడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో వాస్తవికతపై ఇంకా నిర్ధారించ వలసి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌చే బేసిక్ శిక్ష అధికారి (బిఎస్‌ఎ) ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆ తరువాత హెడ్‌మాస్టర్‌ను జులై 24 న సస్పెండ్ చేసినట్టు బేసిక్ శిక్ష అధికారి అవ్యక్త్ రామ్ తివారీ చెప్పారు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోందని, అవసరమైతే హెడ్‌మాస్టర్‌పై కేసు నమోదు చేయిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News