Friday, November 22, 2024

లఖీంపూర్ ఖేరి ఘటనపై విచారణ కమిషన్

- Advertisement -
- Advertisement -
Lakhimpur Kheri
సుప్రీంకోర్టు విచారణకు ముందు యూపి ప్రకటన

లక్నో: లఖీంపూర్‌లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయిన ఘటనపై అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న కొన్ని గంటల ముందే ఈ ప్రకటన వెలువడింది. కమిషన్ విచారణ రెండు నెలల్లో పూర్తికాగలదని యూపి ప్రభుత్వం అక్టోబర్ 6న జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.

చనిపోయిన నలుగురు రైతుల భౌతికకాయాలకు అంతిమకార్యాలు నిర్వహించకుండా గాజు పెట్టెలోనే ఉంచేయడంతో న్యాయవిచారణ జరిపిస్తామని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆ రైతు కుటుంబాలకు హామీ ఇచ్చింది. అక్టోబర్ 3న జరిగిన ఘటనలో నలుగురు రైతులు, ఇద్దరు బిజెపి కార్యకర్తలు, ఓ కారు డ్రైవర్, ఓ స్థానిక విలేకరి చనిపోయారు. నిరసన తెలుపుతున్న రైతులపై హోంశాఖ కేంద్ర సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా మూడు కార్ల ప్రైవేట్ కాన్వాయ్ దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.

బాధితుల్లో ఒకరు ఆశిష్ మిశ్రా కాల్చితే చనిపోయారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడు ఆ ఆరోపణను తిరస్కరించారు.అసలు ఆ నలుగురు రైతులు ఎలా మరణించారన్నది ఇప్పటికీ అపరిషృతంగా ఉంది. కాగా బిజెపి మంత్రి, పార్టీ కార్యకర్తలు సైతం రెండో ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు. అందులో ఆశిష్ కుమార్, మరి 15-20మందిని హతమార్చే కుట్రపన్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ రెండో ఎఫ్‌ఐఆర్ తెలియని వ్యక్తులపై దాఖలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News