Thursday, January 23, 2025

ఇంట్లోకి కోతులు చొరబడితే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా!

- Advertisement -
- Advertisement -

ఆలయాల దగ్గర, యాత్రికులు తిరిగే చోట్ల కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చేతిలో ఉన్నవి లాక్కోవడం, అప్పుడప్పుడు మీదపడి రక్కడం వంటివి చేస్తూ ఉంటాయి. వీటిని చూస్తే చాలు చిన్న పిల్లలు హడలిపోతారు. ఉత్తరప్రదేశ్ లోని బస్తి అనే ఊళ్లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇంట్లోకి జొరబడిన కోతుల మూకను తరిమేందుకు పదమూడేళ్ల బాలిక భలే ఎత్తుగడ వేసింది. దాంతో కోతులు తోక ముడిచుకుని పారిపోయాయి.

ఆ ఊళ్లో పంకజ్ ఓఝా అనే పెద్దాయన ఇంటికి బంధువులు వచ్చారు. కాసేపు ఇంట్లో గడిపిన తర్వాత అందరూ వెళ్లిపోయారు. వారిని దిగబెట్టేందుకు పంకజ్ కూడా వారి వెంట వెళ్లాడు. ఇంట్లో నికిత అనే 13 ఏళ్ల బాలిక, ఆమెకు మేనకోడలు వరసయ్యే 15నెలల బాలిక మాత్రమే మిగిలారు. పంకజ్ తదితరులు వెళ్లేటప్పుడు గేటు వేయకపోవడంతో ఒక కోతుల గుంపు నేరుగా ఇంట్లోకి వచ్చేసింది. కింద ఫ్లోర్ లో తినడానికి ఏమీ దొరక్కపోయేసరికి రెండో ఫ్లోర్ లోకి వచ్చాయి. అక్కడే నికిత తన మేనకోడలితో ఆడుకుంటోంది. కోతుల్ని చూడగానే నికితకు నోటమాటరాలేదు. అయితే కొన్ని క్షణాల్లోనే తేరుకుని, ఇంట్లో ఉన్న అమెజాన్ వాయిస్ సర్వీస్ పరికరం ‘అలెక్సా’కు కుక్కలా మొరగమని ఆదేశాలు ఇచ్చింది. వెంటనే కుక్కలా శబ్దాలు వెలువడ్డాయి. దాంతో ఇంట్లో కుక్క ఉందనుకుని కంగారుపడిన కోతులు వెంటనే తోకముడిచాయి.

ఈ సంఘటనపై పంకజ్ మాట్లాడుతూ తాము వెళ్తూ వెళ్తూ తలుపులు వేయకపోవడంతో కోతులు లోపలికి వచ్చాయన్నాడు. తన ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ అలెక్సా తో అనుసంధానించామని, అలెక్సాకు కమాండ్ ఇవ్వడం తమ ఇంట్లో చాలా సాధారణ విషయమని చెప్పాడు. అయితే మొదటిసారిగా అలెక్సా ఇద్దరు పిల్లలను కాపాడిందని సంతోషం వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News